(1)
సంసారదావానలలీఢలోక-
త్రాణాయ కారుణ్య ఘానా ఘనత్వం
ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య
వందే గురోః శ్రీచరణారవిందమ్
(2)
మహాప్రభోః కీర్తననృత్యగీత –
వాదిత్రమాద్యన్మనసో రసేన
రోమాంచకం పా శ్రుతరంగ భాజో
వందే గురోః శ్రీచరణారవిందమ్
(3)
శ్రీ విగ్రహారాధన నిత్యనానా –
శృంగారత న్మందిర మార్జనాదౌ
యుక్తస్య భక్తంశ్చ నియుంజతోపి
వందే గురోః శ్రీచరణారవిందమ్
(4)
చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాద –
స్వాద్వన్నతృప్తాన్ హరి భక్తసంఘాన్
కృత్వైవ తృప్తిః భజతః సదైవ
వందే గురోః శ్రీచరణారవిందమ్
(5)
శ్రీ రాధికామాధవయోరపార –
మాధుర్యాలీలా గుణరూప నామ్నామ్
ప్రతిక్షణా స్వాదనలో లుపస్య
వందే గురోః శ్రీచరణారవిందమ్
(6)
నికుంజయోనో రతికేళి సిద్యై –
యా యాలిభి ర్యుక్తి రపేక్ష ణీయా
తత్రాతి దాక్ష్యా దతి వల్లభస్య
వందే గురోః శ్రీచరణారవిందమ్
(7)
సాక్షాద్ధరి త్వేన సమస్త శాస్త్రై
రక్తస్తధా భావ్యత ఏవ సద్భిః
కింతు ప్రభొర్య ప్రియ ఏవ తస్య
వందే గురోః శ్రీచరణారవిందమ్
(8)
యస్య ప్రసాదాద్ భగవత్ప్రసాదో
యస్యాప్రసాదాన్న గతిః కుతోపి
ధ్యాయన్ స్తువంస్తస్య యశ స్త్రిస న్ధ్యం
వందే గురోః శ్రీచరణారవిందమ్
(1)
శ్రీ గురుదేవులు కరుణాసాగరము నుండి వరములను పొందుచున్నారు. మేఘము వర్షించి కార్చిచ్చును ఆర్పునట్లుగానే శ్రీ గురుదేవులు సంసార మనెడు కార్చిచ్చును ఆర్పి భౌతిక దుఃఖములతో బాధపడుచున్న జగత్తును విముక్తి గావించుచున్నారు అటువంటి కళ్యాణగుణసాగరుడైన శ్రీ గురుదేవుని పాదములకు నా గౌరవపూర్వక ప్రణామములు.