పలుకే బంగారమాయెనా

English తెలుగు

ప: పలుకే బంగారమాయెనా కోదండపాణి || పలుకే ||

చ 1: పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి

కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి || పలుకే ||

చ 2: ఇరువుగ ఇసుకలోన పొరలిన యుడుత భక్తికి

కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రి || పలుకే ||

చ 3: రాతి నాతిగజేసి భూతలమందున ప్ర

ఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి || పలుకే ||

చ 4: ఎంత వేడినను నీకు సుంతైన దయరాదు

పంతము చేయ నేనెంతవాడను తండ్రి || పలుకే ||

చ 5: శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగావా

కరుణించు భద్రాచల వర రామదాస పోష || పలుకే ||

Scroll to Top